Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌!

Author
Posted By DIKSOOCHI MEDIA
| 25 Oct 2026, 12:00 PM | Array
మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌!

">డీజేల మోతతో నిద్రకు దూరమవుతున్న స్థానికులు

  • ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు!

  • మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌!
    డీజేల మోతతో నిద్రకు దూరమవుతున్న స్థానికులు
    ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు!
    తుర్కయంజాల్ , నేటి దిక్సూచి : ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో
    నివాస ప్రాంతాల మధ్య రిసార్ట్‌ నిర్వహణ.. అర్ధరాత్రి వరకు డీజేల హోరు.. మద్యం మత్తులో సందడి చేసే అతిథుల అల్లరి.. వెరసి మునగనూరు గ్రామంలోని ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిసార్ట్‌ నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 కుటుంబాలు ఈ సమస్యతో సతమతమవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.


    ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం!
    రిసార్ట్‌లో అర్ధరాత్రి వరకు డీజేలు మోగించడం, వేడుకల పేరుతో అధిక శబ్దం చేయడం వల్ల రోజువారీ జీవనం దెబ్బతింటోందని స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని, పిల్లల చదువులు, వృద్ధుల విశ్రాంతికి ఆటంకం కలుగుతోందని వాపోతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య కొనసాగుతోందని మండిపడుతున్నారు.
    నిబంధనలు అమలవుతున్నాయా?
    నివాస ప్రాంతాల్లో రిసార్ట్‌ వంటి వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు సంబంధిత అనుమతులు, భవన వినియోగ నిబంధనలు, శబ్ద కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు, డీజేల వినియోగంపై నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే మునగనూరులోని సెవెన్ స్టార్ రిసార్ట్‌లో ఈ నిబంధనలు పాటిస్తున్నారా? అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
    ఉన్నతాధికారులు స్పందించేనా?
    ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రిసార్ట్‌ అనుమతులు, నిర్వహణ తీరు, శబ్ద కాలుష్యంపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫిర్యాదులను బుట్టదాఖలు చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నివాసితులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

    మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌! - Additional Image
    #సతమతమవ #అమలవ #వహణక #అవసరమ #అవసర
    అత్యధికంగా చదివినవి